![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం-2 (Karthika Deepam2)'.. దీప, కార్తీక్‌ల మాటలు విని.. జ్యోత్స్నని క్షమించకూడదని దాస్ నిర్ణయించుకుంటాడు. దీప టిఫెన్ బండిని కాల్సించింది జ్యోత్స్న అని దాసు చాటుగా వినేస్తాడు. జ్యోత్స్నా.. నీ పాపాలు ఇక పండిపోయాయి. నిన్ను క్షమించను.. దీపే వారసురాలు అనే నిజాన్ని వెంటనే అన్నయ్యా వదినలకు చెప్పి తీరతానని దాస్ బయలుదేర్తాడు. అనుకున్నట్లే జ్యోత్స్న రగిలిపోతుంటే రాత్రి అయ్యేసరికి దాసు ఆ ఇంటికి వస్తాడు. దాసు రావడం జ్యోత్స్న చూస్తుంది. గ్రానీ కొడుకు వచ్చాడంటే ఏదో కారణం ఉంది.. ఎందుకు వచ్చి ఉంటాడని మనసులో అనుకుంటూ జ్యోత్స్న బయటకి పరుగుతీస్తుంది. అయితే ఆమెతో పాటు ఉన్న పారిజాతం కూడా వెనుకే వెళ్తుంది. అయితే అనుకున్నట్లే.. దాసు.. శివనారాయణ కంటపడతాడు. ఎందుకొచ్చావంటూ దాస్ ని నిలదీస్తాడు.. శివనారాయణ. ఇంతలోనే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కిందకు వస్తారు.
దాసు ఈ వేళ ఎందుకొచ్చావయ్యా అని అప్పుడే వచ్చిన సుమిత్ర అంటుంది. మాట్లాడాలి వదినా అనేలోపు ఇక శివనారాయణ రెచ్చిపోతాడు. పోతావా లేదా బయటికి అంటూ ఫైర్ అవుతాడు. దాంతో దాసు.. మౌనంగా వెళ్లిపోతాడు. శివనారాయణ కోపంగా లోపలికి వెళ్లగానే.. దాస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పాపం దాసు మంచివాడండి అని దశరథ్‌తో సుమిత్ర అంటే.. అందుకే అందరికీ దూరం అయ్యాడని దశరథ్ లోపలికి వెళ్లిపోతాడు బాధగా. ఇక సుమిత్ర కూడా వెళ్లగానే జ్యోత్స్న.. ఈ గ్రానీ కొడుకు నిజం చెప్పడానికే వచ్చినట్లున్నాడు. ఈ రెండు రోజులు మమ్మీ డాడీలను ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని జ్యోత్స్న మనసులో ఫిక్స్ అవుతుంది. మరునాడు శివన్నారాయణ బయటకు వెళ్ళాక దాస్ వస్తాడు. ఎదురుగా దాసుని చూసిన జ్యోత్స్న బిత్తరపోతుంటే.. లోపల ఉన్నారు.. తలుపు ఎందుకు వేస్తున్నావంటూ నిలదీస్తాడు దాసు. ఎవరు లేరు నాన్నా.. నాతో రా.. ప్లీజ్ నాతో రా అంటూ దాస్ ని బలవంతంగా బయటికి దాకా లాక్కునిపోతుంది జ్యోత్స్న. ఇక దశరథ్ ఏమో పై వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సుమిత్ర ఏమో లోపల స్నానం చేస్తుంటుంది. ఇక బయటికి వచ్చాక చాలా సేపు.. చెప్పొద్దని జ్యోత్స్న.. చెబుతానని దాసు గొడవకు దిగుతారు. జ్యో చాలా రిక్వస్ట్ చేస్తుంది. ఇంతలో సుమిత్ర స్నానం చేసి.. చీర కట్టుకుని.. బయటికి వచ్చేసరికి తలుపు రాదు.. ఫోన్ వెతుక్కుంటూ ఉంటుంది. తలుపు కొడుతుంటుంది.
ఇక జ్యోత్స్న మాట వినడు దాస్. సుమిత్రేమో బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ లోపు దశరథ్ వాష్ రూమ్‌కి వెళ్తి వస్తాడు. ఇక బయట రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక జ్యోత్స్నని దాస్ తోసేసి మరీ లోపలికి నడుస్తుంటాడు. నేను చచ్చినా ఈ నిజాన్ని దాచను.. చెప్పే తీరతానని దాస్ వెళ్తుంటాడు. ఇక అప్పుడే చేతికి దొరికిన ఇనుప రాడ్‌తో వెనుక నుంచి దాసుని తలమీద కొట్టేస్తుంది జ్యోత్స్న. దాంతో దాస్.. ఆ అని పెద్ద అరుపు అరిచి అన్నయ్యా అని తలపట్టుకుంటాడు. ఆ అరుపుకి దశరథ్ పైన బాల్కనీలోకి వచ్చి చూసి.. ఎవరు అంత గట్టిగా అరిచారంటూ చూస్తుంటాడు. అప్పుడే దశరథ్ అరే దాసు అంటూ ఉంటాడు. తరువాయి భాగంలో దాసు వెనుక జ్యోత్స్న ఇనుపు రాడ్‌తో రగిలిపోతూ చూస్తున్నట్లు దాన్ని దశరథ్ చూస్తున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |